పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది యువతకి ఒక స్ఫూర్తి. ఆయన లాగా నడవాలని, ఆయన లాగా నవ్వాలని బయటి యువతే కాకుండా సినిమా రంగంలోని యువ హీరోలు కూడా కలలు కంటారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ సమాజ సేవ చేయమని కేవలం మాటలతో చెప్పటమే కాకుండా స్వయంగా ఆచరిస్తే అది సమాజంలోకి ఎంతగా చొచ్చుకుని వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్న పవన్ కళ్యాణ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాడు అని కోరుకుందాం.